Rajat Bhargava: ఆరోగ్యం బాగాలేదు..తర్వాత వస్తా
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:27 AM
మద్యం కుంభకోణంలో విచారణకు తర్వాత వస్తానంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ సిట్ అధికారుల నోటీసుకు బదులిచ్చారు. రూ.మూడున్నర వేల కోట్ల కుంభకోణాన్ని...
'సిట్’ నోటీసులకు రజత్ భార్గవ స్పందన
అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో విచారణకు తర్వాత వస్తానంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ సిట్ అధికారుల నోటీసుకు బదులిచ్చారు. రూ.మూడున్నర వేల కోట్ల కుంభకోణాన్ని వెలికి తీస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేసిన రజత్ భార్గవ పలు ఉల్లంఘనలను అడ్డుకోలేదని గుర్తించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా రజత్ భార్గవకు సిట్ అధికారులు నోటీసు ఇచ్చారు. అయితే అనారోగ్యంతో బాధ పడుతున్నందున ఇప్పుడు రాలేనని, ఆరోగ్యం మెరుగు పడ్డాక వస్తానంటూ దర్యాప్తు అధికారికి ఆయన ఎస్‌ఎంఎస్ ద్వారా బదులిచ్చారు.