Deputy Tahsildar Manideep: ఇంకా అజ్ఞాతంలోనే డీటీ మణిదీప్
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:34 AM
ఇటీవల హైదరాబాద్‌లో పట్టుబడిన డ్రగ్స్ ముఠా.. రేవ్ పార్టీల నిర్వహణలో కీలకవ్యక్తిగా వ్యవహరించిన రాజమహేంద్రవరం డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్....
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఇటీవల హైదరాబాద్‌లో పట్టుబడిన డ్రగ్స్ ముఠా.. రేవ్ పార్టీల నిర్వహణలో కీలకవ్యక్తిగా వ్యవహరించిన రాజమహేంద్రవరం డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ధవళేశ్వరంలోని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఏవో కార్యాలయంలో ఆయన డిప్యుటేషన్‌ను అధికారులు రద్దు చేశారు. వాస్తవానికి మణిదీప్ పోస్టు ఏజెన్సీ వీఆర్‌పురం యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పరిధిలో ఉంది. ధవళేశ్వరంలో డిప్యుటేషన్‌ను రద్దు చేసినా, ఆయన ఇంత వరకూ వీఆర్‌పురంలో విధుల్లోనూ చేరలేదు.