Rajahmundry Jail: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు శుభ్రతలో దేశంలో మూడో స్థానం
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:25 AM
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు మరో ఘనత దక్కింది. గతంలో జీవ వైవిధ్యంలో..
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు మరో ఘనత దక్కింది. గతంలో జీవ వైవిధ్యంలో పురస్కారం పొందగా ఇప్పుడు ప్రిజన్ హైజీన్‌లో దేశంలోనే మూడో స్థానం కైవసం చేసుకొంది. ఈ మేరకు కాంస్య పతకాన్ని హైదరాబాద్‌లో ఈ నెల 11వ తేదీన అందుకున్నట్టు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ శనివారం తెలిపారు.