Name Change: లోక్ భవన్‌గా రాజ్‌భవన్
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:40 AM
రాష్ట్రంలోని రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పేరు మార్పునకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు.
పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం.. వెంటనే నోటిఫికేషన్
అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పేరు మార్పునకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ పేరు మారుస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాములు బుధవారం నోటిఫికేషన్ జారీచేశారు. గవర్నర్ ఆమోదించిన వెంటనే లోక్‌భవన్ అధికారులు గవర్నర్ వెబ్‌సైట్, అన్ని ఆన్‌లైన్ వేదికల్లో రాజ్‌భవన్ స్థానంలో లోక్‌భవన్‌గా పేర్లు మార్చేశారు. కాగా, ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోక్‌భవన్‌లో నాగాలాండ్, అసోం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని, ఆయా రాష్ట్రాల చిన్నారుల నృత్యాలను తిలకించారు. కార్యక్రమంలో లోక్‌భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.