Share News

Polavaram Project: వానొచ్చినా.. వరదొచ్చినా.. ముందుకే

ABN , Publish Date - Jul 27 , 2025 | 04:10 AM

వరదొచ్చినా వానొచ్చినా తగ్గేదేలే! అంటూ పోలవరం ప్రాజెక్టుకు పనులు వేగంగా సాగుతున్నాయి. శనివారం నాటికి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నా.. డయాఫ్రంవాల్‌, బట్రస్‌ డ్యాం, గ్యాప్‌ 1 పనులు వేగంగా చేస్తున్నారు.

Polavaram Project: వానొచ్చినా.. వరదొచ్చినా.. ముందుకే

  • వేగంగా ‘పోలవరం’ డయాఫ్రంవాల్‌ పనులు

పోలవరం, జూలై 26(ఆంధ్రజ్యోతి): వరదొచ్చినా వానొచ్చినా తగ్గేదేలే! అంటూ పోలవరం ప్రాజెక్టుకు పనులు వేగంగా సాగుతున్నాయి. శనివారం నాటికి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నా.. డయాఫ్రంవాల్‌, బట్రస్‌ డ్యాం, గ్యాప్‌ 1 పనులు వేగంగా చేస్తున్నారు. 1,396 మీటర్ల మేర డయాఫ్రంవాల్‌ నిర్మాణం చేయాల్సి ఉండగా ఇప్పటికే 404 మీటర్లు పూర్తయ్యింది. 373 ప్యానెల్స్‌ నిర్మించాల్సి ఉండగా 124 పూర్తయ్యాయి. డయాఫ్రంవాల్‌ పనులను ఈ ఏడాది జనవరి 2న ప్రారంభించాల్సి ఉండగా డిజైన్‌ ఎనాలసిస్‌ జాప్యం వల్ల ప్రారంభం కాలేదు. జనవరి 16న టీ5 ప్లాస్టిక్‌ కాంక్రీటుతో నిర్మాణం చేయవచ్చని సీడబ్ల్యూసీ, సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ అధికారులు చెప్పడంతో మంత్రి నిమ్మల రామానాయుడు జనవరి 18న పనులు ప్రారంభించారు. ప్రస్తుతం రెండు కాఫర్‌ డ్యాంల మధ్య 15.95 మీటర్ల నీటిమట్టం ఉన్నా.. ఎలాంటి ఆటంకం లేకుండా డీవాటరింగ్‌ పనులు సక్రమంగా జరుగుతున్నాయని డిసెంబరు నెలాఖరుకు ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేస్తామని ఈఈ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Jul 27 , 2025 | 04:14 AM