Share News

Weather Update: నేడు దక్షిణ కోస్తా, సీమల్లో వర్షాలు

ABN , Publish Date - Nov 05 , 2025 | 05:56 AM

కోస్తా తీరానికి ఆనుకుని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు...

Weather Update: నేడు దక్షిణ కోస్తా, సీమల్లో వర్షాలు

అమరావతి, విశాఖపట్నం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): కోస్తా తీరానికి ఆనుకుని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అమరావతిలోని విపత్తుల నిర్వహణసంస్థ తెలిపింది. బుధవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. కాగా, ప్రస్తుతం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలకు అనుకూలమైన వాతావరణం కొనసాగుతోందని విశాఖ వాతావరణశాఖ నిపుణుడొకరు తెలిపారు. తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వాయవ్యంగా పయనించి మంగళవారానికి ఈశాన్య బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో తీవ్ర అల్పపీడనంగా మారిందన్నారు. ఇది బంగ్లాదేశ్‌ వైపు పయనిస్తున్నందున దీని ప్రభావం రాష్ట్రంపై ఉండదన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 07:38 AM