Share News

కర్నూలు, డోనలో రైల్వే జీఎం ఆకస్మిక పర్యటన

ABN , Publish Date - Aug 01 , 2025 | 11:26 PM

కర్నూలు, డోన రైల్వే స్టేషనను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాత్సవ అకస్మికంగా తనిఖీ చేశారు.

   కర్నూలు, డోనలో రైల్వే జీఎం ఆకస్మిక పర్యటన
కర్నూలు రైల్వేస్టేషన అభివృద్ధి ప్లానను పరిశీలిస్తున్న జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమర్‌ శ్రీవాత్సవ

అభివృద్ధి పనులు పరిశీలన

కర్నూలు రూరల్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): కర్నూలు, డోన రైల్వే స్టేషనను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాత్సవ అకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ నుంచి హైదరాబాద్‌ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ లోకేశ వైష్ణోయ్‌తో కలిసి ఆయన ప్రత్యేక రైలులో బయలుదేరి నేరుగా డోన రైల్వేస్టేషనకు వెళ్లారు. డోన రైల్వేస్టేషన పరిశీలించి అక్కడి నుంచి కర్నూలుసిటి రైల్వే స్టేషనకు ఉదయం 9గంటలకు చేరుకున్నారు. రైల్వేస్టేషనలో అమృత భారత స్టేషన కింద జరుగుతున్న పలు రైల్వే అభివృద్ధి పనులను జనరల్‌ మేనేజర్‌ పరిశీలించారు. వెంకటరమణ కాలనీ వైపు ఎంట్రీగేట్‌, అటువైపు నుంచి స్టేషన ముఖద్వారం దాకా బ్రిడ్జి, స్టేషన ముఖద్వారం ఆవరణంలో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం కర్నూలు రైల్వేస్టేషన నుంచి కర్నూలు మండలం పంచలింగాల గ్రామ శివారులో జరుగుతున్న రైల్వేవర్క్‌షాపునకు వెళ్లి పనులను పరిశీలించారు. అక్కడి నుంచి జోగులాంబ రైల్వేస్టేషనకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట రైల్వే జీఎం టు సెక్రటరి శ్రీనివాస్‌ మల్లాడి, రైల్వే చీఫ్‌ ఇంజనీర్‌ నాగభూషణం, సాంబశివరావు, డివిజన స్థాయి అధికారులు, కర్నూలుసిటి రైల్వేస్టేషన శేషఫణి, సీసీఐ మున్నాజీరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 01 , 2025 | 11:26 PM