నాణ్యమైన విద్యను అందించాలి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:23 PM
చెంచుబిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలని విద్యాశాఖ జిల్లా అధికారి జనార్దన రెడ్డి ఆదేశించారు.
‘పది’లో వందశాతం
ఫలితాలు సాధించాలి
జిల్లా విద్యాశాఖ
అధికారి జనార్దన రెడ్డి
కొత్తపల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): చెంచుబిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలని విద్యాశాఖ జిల్లా అధికారి జనార్దన రెడ్డి ఆదేశించారు. శని వారం ఆయన మండలంలోని శివపురం గిరిజన ఆశ్రమ పాఠశాలను ఎంఈవో-1 నా గరాజు, ఎంఈవో-2 ఇనయతుల్లాతో కలిసి తనిఖీ చేశారు. 1 నుంచి 10వ తరగతి వరకు 114 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం 86 మంది వి ద్యార్థులే హాజరు కావడంపై డీఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డీఈవో గిరిజన విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. అలాగే స్థానిక అంగనవాడీ సెంటర్‌ను సైతం పరిశీలిం చారు. అనంతరం గిరిజన విద్యార్థులకు నా ణ్యమైన విద్య అందించాలని ఆదేశించారు.
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలో కొత్తపల్లి మండలం నుంచి వందశాతం విజయం సాధించాలని డీఈవో జనార్దన రెడ్డి ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. శనివారం మధ్యాహ్నం కొత్తపల్లి జడ్పీహెచఎ్‌సలోని క్లస్టర్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీఈవో పాల్గొన్నారు. డిసెంబరు 5న ఉపాధ్యాయులు, వి ద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. అలా గే డిసెంబరు 6 నుంచి మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకుని వాటికి అనుగుణంగా విద్యార్థులకు బోధన చేయాలని ఆదేశించారు. ప్రధానంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీసీ రామకృష్ణ, హెచఎం వెంకటరమణ, మండలంలోని ఆయా పాఠశాలల ప్రధానోపాద్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, కొత్తపల్లి క్లస్టర్‌కు చెందిన సంబందిత ఉపాద్యాయులు పాల్గొన్నారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
ఆత్మకూరురూరల్: విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందని డీఈవో జనార్దన రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని వెంకటాపురం జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో మన బడి మన భవిష్యత్తు స్కీం కింద ప్రభుత్వం నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను, దాత పరమేశ్వరరెడ్డి సహకారంతో నిర్మించిన స్టేజీని సర్పంచ మహానంది గంగాదేవితో కలిసి డీఈవో ప్రారంభించారు. పాఠశాలలోని మ్యాథమేటిక్స్ ల్యాబ్‌ను, విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని తిలకించి విద్యార్థులను అభినందించారు. పదిలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంపొందించేందుకు అదనపు తరగతులు నిర్వహిస్తుండటంతో ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవోలు మేరి మార్గరేట్, అయ్యూబ్‌అహ్మద్, విద్యా కమిటీ చైర్మన ఏరువ రమణారెడ్డి, టీడీపీ నాయకుడు రాజేంద్రారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.