Share News

WhatsApp feedback: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక్కడ స్కాన్ చేయండి చాలు..

ABN , Publish Date - May 03 , 2025 | 05:15 AM

భక్తుల అభిప్రాయాలను సులభంగా సేకరించేందుకు టీటీడీ నూతన ఫీడ్‌బ్యాక్‌ విధానాన్ని ప్రారంభించింది. తిరుమల, తిరుపతిలో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా వాట్సాప్‌లో అభిప్రాయం తెలిపే అవకాశం కల్పించింది.

WhatsApp feedback: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక్కడ స్కాన్ చేయండి చాలు..

మెరుగైన సేవల కోసం టీటీడీ క్యూఆర్‌ కోడ్‌ విధానం

తిరుమల, మే 2(ఆంధ్రజ్యోతి): భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఫీడ్‌బ్యాక్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులు తమ అభిప్రాయాలను వాట్సాప్‌ ద్వారా సులభంగా తెలియజేసేలా నూతన పద్ధతికి శ్రీకారం చుట్టింది. దీని కోసం తిరుమల, తిరుపతిలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో క్యూఆర్‌ కోడ్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. భక్తులు తమ మొబైల్‌తో కోడ్‌ను స్కాన్‌ చేస్తే వాట్సా్‌పలో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులోకి ప్రవేశించిన వెంటనే తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, పరిశుభ్రత, కల్యాణకట్ట, లడ్డూప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్‌, గదులు వంటివి) ఎంచుకోవాలి. అనంతరం తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు టెక్ట్స్‌ లేదా వీడియో ఫార్మాట్‌ను ఎంచుకోవాలి. తర్వాత సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు, మరింత మెరుగదల అవసరం, లేదా బాగాలేదు అనే ఐచ్ఛికాల ద్వారా రేటింగ్‌ చేయాలి. అభిప్రాయాన్ని సమర్పించిన తర్వాత ధ్రువీకరణ సందేశాన్ని భక్తులు పొందవచ్చు. ఈ ఫీడ్‌బ్యాక్‌ను టీటీడీ అధికారులు పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటారు.


ఇవి కూడా చదవండి..

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..

Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు

Updated Date - May 03 , 2025 | 11:38 AM