PVN Madhav: పార్టీ బలోపేతానికి సమయం కేటాయించండి
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:52 AM
రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ నాయకులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ సూచించారు. పార్టీ బాధ్యతలు తీసుకున్న వారు పార్టీ అభ్యున్నతి కోసం సమాయాన్ని కేటాయించాలన్నారు.
ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఉండేలా చూడండి
పదాధికారులు, మోర్చా ప్రతినిధుల వర్క్‌షాప్‌లో మాధవ్
విజయవాడ సిటీ, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ నాయకులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ సూచించారు. పార్టీ బాధ్యతలు తీసుకున్న వారు పార్టీ అభ్యున్నతి కోసం సమాయాన్ని కేటాయించాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, మోర్చా ప్రతినిధులతో శుక్రవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. ‘ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నాయకులు కదిలిరావాలి. దీని కోసం ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో జరిగే పీజీఆర్‌ఎ్‌సను సద్వినియోగం చేసుకోవాలి. జాతీయ, రాష్ట్ర పార్టీ ఇచ్చే కార్యక్రమాలను నిర్వహించాలి. మన జెండా-మన ఊరు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలి. ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండా ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని మాధవ్ పేర్కొన్నారు. అనంతరం గిడుగు రామ్మూర్తి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ పార్టీ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌కి రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని పరిచయం చేశారు. కార్యక్రమంలో మంత్రి వై.సత్యకుమార్, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు సి.ఆదినారాయణరెడ్డి, పార్థసారథి, ఎన్.ఈశ్వరరావు, పార్టీ కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.