ఆర్‌ఎస్‌కేల్లో సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:40 PM
రైతుసేవా కేంద్రాల్లో (ఆర్‌ఎస్‌కే) సమయపాలన పాటించి పనిచేయాలని తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ స్పష్టంచేశారు. రైతుసేవా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్లు, డాటాఆపరేటర్లు నిబంధన లు పాటించకపోతే చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు.
ఎల్.ఎన్.పేట, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): రైతుసేవా కేంద్రాల్లో (ఆర్‌ఎస్‌కే) సమయపాలన పాటించి పనిచేయాలని తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ స్పష్టంచేశారు. రైతుసేవా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్లు, డాటాఆపరేటర్లు నిబంధన లు పాటించకపోతే చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు.గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు, డాటా ఆపరేటర్లతో ధాన్యం కొను గోలుపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల నుంచి రైతుసేవా కేంద్రాలద్వారా ధాన్యం కొనుగోలుకు వ్యవసాయశాఖ సిబ్బంది, డాటాఆపరేటర్లు ట్ర క్కుసీట్లు అప్‌లోడ్ చేయడంలో విఫలమవుతున్నారని తెలిపారు. దీంతో రైతులు రైస్‌మిల్లుల వద్ద ఇబ్బందులకు గురికావలసివస్తుండడంతో డాటా ఆపరేటర్లపైన ఆగ్రహం వ్యక్తంచేశారు.కాగాధాన్యం కొనుగోలు సమయం సీజన్‌కావడంతో మిల్లుల వద్ద తగినంతమంది కళాసీలు ఉండాలని తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ తెలిపారు. ఎల్. ఎన్.పేటలోనరి రైస్‌మిల్లులను ఆమె తనిఖీచేశారు. ఆమెతోపాటు ఏవో కిరణ్‌వాణి, డీటీ తహసీల్దార్ కె. నీలిమ, సీనియర్ అసిస్టెంటు ఎస్.గవరయ్య ఉన్నారు.