-
-
Home » Andhra Pradesh » pulivendula zptc election results live updates abn vr
-
Pulivendula ZPTC Election Live Updates: వైసీపీని కుమ్మేసిన కూటమి.. ఒంటిమిట్ట జడ్పీటీసీ టీడీపీ కైవసం
ABN , First Publish Date - Aug 14 , 2025 | 10:44 AM
ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జగన్ కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేసింది. ఒంటిమిట్టలోనూ టీడీపీ దూసుకుపోతోంది. ఈ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్ మీకోసం ABN ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది.
Live News & Update
-
Aug 14, 2025 13:38 IST
ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలో టీడీపీ విజయం
6,154 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం
ముద్దు కృష్ణారెడ్డి(టీడీపీ)-12,505, సుబ్బారెడ్డి(వైసీపీ)-6,351 ఓట్లు
-
Aug 14, 2025 13:26 IST
విజయవాడ: పులివెందుల ప్రజలకు ఒకరోజు ముందే స్వాతంత్ర్యం వచ్చింది, 30ఏళ్లుగా వైఎస్ కుటుంబ పాలనలో నలిగిపోయిన పులివెందుల ప్రజలు సంకెళ్లు తెంచుకుని ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికారు: ఎక్స్‌లో టీడీపీ నేత బుద్దా వెంకన్న
-
Aug 14, 2025 13:22 IST
జగన్ మాట్లాడితే గంగమ్మ జాతర, రప్పా రప్పా అంటారు: బీటెక్ రవి
పులివెందుల ఉప ఎన్నికలో రప్పా రప్పా బ్యాచ్ ఏమైంది?: బీటెక్ రవి
పులివెందులలో రీపోలింగ్ కోరింది వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డే
రీపోలింగ్‌లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థికి పట్టంకట్టారు: బీటెక్ రవి
-
Aug 14, 2025 13:11 IST
పులివెందుల ZPTC ఉప ఎన్నిక పూర్తి ఫలితాలు..
లతారెడ్డి(టీడీపీ)-6,716 ఓట్లు, హేమంత్‌రెడ్డి(వైసీపీ)-683 ఓట్లు
మొత్తం ఓట్లు-7638 ఓట్లు, లతారెడ్డి(టీడీపీ)-6,716 ఓట్లు
హేమంత్‌రెడ్డి(వైసీపీ)-683 ఓట్లు, శివకళ్యాణ్(ఇండిపెండెంట్)-101 ఓట్లు
ఇండిపెండెంట్లు రాజేంద్రనాథ్‌రెడ్డి-79 ఓట్లు, జైభరత్‌రెడ్డి-35 ఓట్లు
ఇండిపెండెంట్లు రవింద్రారెడ్డి-14ఓట్లు, సురేష్‌రెడ్డి-4 ఓట్లు, నోటాకు 11 ఓట్లు
-
Aug 14, 2025 13:00 IST
ఒంటిమిట్ట జడ్పీటీసీ టీడీపీ కైవసం
ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి విజయం
-
Aug 14, 2025 12:52 IST
కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది: పేర్ని నాని
ప్లాన్ ప్రకారమే పులివెందుల ZPTC ఉప ఎన్నిక తెచ్చారు: పేర్ని నాని
పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఎన్నికలు నిర్వహించారు: పేర్ని నాని
ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఓట్లు వేశారు: పేర్ని నాని
పులివెందులలో 90 శాతం దొంగ ఓట్లు వేశారు: మాజీమంత్రి పేర్ని నాని
టీడీపీ అరాచకాలకు అధికారులు వంతపాడారు: మాజీమంత్రి పేర్ని నాని
-
Aug 14, 2025 12:22 IST
విజయవాడ: పులివెందులకు ఆగస్టు 14న స్వాతంత్య్రం వచ్చింది: బుద్దా వెంకన్న
ఆగస్టు 15 దేశానికి స్వతంత్రం వచ్చింది.
కానీ పులివెందుల ప్రజలకు ఈ యేడాది ఒకరోజు ముందే స్వతంత్రం వచ్చింది.
30 ఏళ్లుగా వైఎస్ కుటుంబ పాలనలో నలిగిపోయిన పులివెందుల ప్రజలు వారి సంకెళ్లు తెంచుకొని నేడు ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికారు.
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కలయికలో నేడు పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించింది.
ఈ కలయిక మరో 30ఏళ్ల పాటు కొనసాగుతూ ప్రజలు నిజమైన ప్రజా పాలనను చూస్తారు.
ట్విట్టర్‌లో టిడిపి నేత బుద్దా వెంకన్న.
-
Aug 14, 2025 12:19 IST
పులివెందుల విజయంపై సీఎం చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్ ఇదే..
అమరావతి: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.
జిల్లాలో అందరు ఈ విజయం పట్ల రియాక్ట్ కావాలని సీఎం ఆదేశాలు.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయని చెప్పిన సీఎం.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి 11 మంది నామినేషన్లు వేశారు.
పులివెందుల కౌంటింగ్‌లో 30 ఏళ్ల తరువాత ఓటు వేశామని స్లిప్ పెట్టారు.
అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీరు గమనించాలి.
అందరు ప్రజలను చైతన్యం చేసే విధంగా మాట్లాడాలని సూచించిన చంద్రబాబు.
పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు.
30 ఏళ్ల తరువాత వాళ్ళు ఓటు వేశారు అనేది రాష్ట్రంలో ప్రజలకు తెలియచేయండి అని చెప్పిన చంద్రబాబు.
ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయి అనికూడా చెప్పండి అని మంత్రులకు చెప్పిన చంద్రబాబు.
-
Aug 14, 2025 12:14 IST
కొనసాగుతోన్న ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నిక కౌంటింగ్
తొలి రౌండ్‌లో 3,105 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి
ముద్దు కృష్ణారెడ్డి(టీడీపీ) 6,270 ఓట్లు, సుబ్బారెడ్డి(వైసీపీ) 3,165 ఓట్లు
-
Aug 14, 2025 12:13 IST
ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: మంత్రి సవిత
ప్రశాంతంగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది.
ఎన్డీయే కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేసి గెలిచాం.
ఎవరు పోటీ చేస్తారని సీఎం అడిగితే బీటెక్ రవి కుటుంబం ముందుకొచ్చింది.
ప్రతి ఇంటికి వెళ్లి ఓటు వేయాలని కోరాం. ప్రజలు ముందుకొచ్చారు.
11 మంది నామినేషన్లు వేయడం ద్వారా ప్రజాస్వామ్యం గెలిచింది.
ఈ విజయాన్ని చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇస్తున్నాం.
అవినాష్ రెడ్డి ఓటు అడగడంతోనే ప్రజాస్వామ్యం వచ్చింది.
11 నామినేషన్లు పడ్డరోజే వైసీపీ ఎందుకు బహిష్కరించలేదు.
ఓటింగ్ సరళి చూసి ఓటమి ఖాయమని నమ్మి బహిష్కరించారు.
ప్రజలే వైసీపీని బహిష్కరించారు.
పులివెందుల సమస్యలు జగన్ ఎప్పుడూ పరిష్కరించలేదు.
పులివెందుల ప్రజలు టీడీపీ పట్ల విశ్వాసం చూపించారు.
సొంత పులివెందులలో కూడా డిపాజిట్లు రాని పార్టీ వైసీపీ.
బీటెక్ రవి, చంద్రబాబుపై కాదు పులివెందుల ఫలితంపై జగన్ మాట్లాడాలి.
-
Aug 14, 2025 12:12 IST
పులివెందులలో రిగ్గింగ్ జరిగింది: ఎంపీ అవినాష్‌రెడ్డి

అసలు దీన్ని ఎలక్షన్ అంటారా?: ఎంపీ అవినాష్‌రెడ్డి
దొంగ ఓట్లతో గెలవడం కూడా గెలుపేనా?: అవినాష్
నిజమైన ఓటర్‌ను అసలు పోలింగ్ బూత్‌లోకే పోనివ్వలేదు
పోలీసులు, టీడీపీ శ్రేణులు ఓటర్ల స్లిప్పులు లాక్కున్నారు
టీడీపీకి గుణపాఠం చెప్పేరోజు వస్తుంది: ఎంపీ అవినాష్‌రెడ్డి
దొంగ ఓట్లతో కాదు.. నిజమైన ఓట్లతో గెలుస్తాం: అవినాష్‌రెడ్డి
-
Aug 14, 2025 11:57 IST
కొనసాగుతోన్న ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నిక కౌంటింగ్
3,420 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి
-
Aug 14, 2025 11:44 IST
పులివెందులలో రిగ్గింగ్ జరిగింది: ఎంపీ అవినాష్‌రెడ్డి
గెలిచామని టీడీపీ అనుకోడమే
త్వరలో టీడీపీకి గుణపాఠం చెబుతాం: అవినాష్‌రెడ్డి
-
Aug 14, 2025 11:41 IST
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నమ్మకంతో ప్రజలు విజయం కట్టబెట్టారు
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీదే విజయం: మంత్రి రాంప్రసాద్
-
Aug 14, 2025 11:39 IST
విజయనగరం: హోం మంత్రి వంగలపూడి అనిత సంచలన కామెంట్స్.
కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకమే పులివెందుల విజయం.
జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ఓటమి ఓ చెంప దెబ్బ.
చంద్రబాబు నాయుడు వయసును కూడా గౌరవించకుండా జగన్ నోటి దురుసుతనంగా వ్యవహరించడం వైసీపీ సంస్కృతికి పరాకాష్ట.
పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని, విలువను పెంచారు.
తనకు పోలీసులు రక్షణ పెంచమని ఓవైపు కోరుతూనే మరోవైపు పోలీసులపై నమ్మకం లేదని దూషించటం జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనం.
-
Aug 14, 2025 11:37 IST
జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతాం: మంత్రి
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: మంత్రి సవిత
అభివృద్ధి కోసమే ప్రజలు ఈ తరహా తీర్పు ఇచ్చారు: సవిత
వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతాం: సవిత
-
Aug 14, 2025 11:34 IST
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నమ్మకంతో ప్రజలు విజయం కట్టబెట్టారు
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీదే విజయం: మంత్రి రాంప్రసాద్
-
Aug 14, 2025 11:33 IST
ఒంటిమిట్టలో దూసుకుపోతున్న టీడీపీ..
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
ఇక్కడ కూడా టీడీపీ దూసుకుపోతోంది.
3420 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణా రెడ్డి.
-
Aug 14, 2025 11:29 IST
జగన్‌పై ఎంత వ్యతిరేకత ఉందో పులివెందుల తీర్పే చెబుతోంది: అనిత
పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదు: హోంమంత్రి అనిత
పోలీసులను వైసీపీ నేతలు తప్పుబట్టడం సరికాదు: హోంమంత్రి అనిత
గతంలో పులివెందులలో ధైర్యంగా ఓట్లు వేసి పరిస్థితులు లేవు: అనిత
ప్రభుత్వంపై నమ్మకంతోనే ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేశారు: అనిత
-
Aug 14, 2025 11:26 IST
పులివెందుల కోటపై ఎగిరిన పసుపు జెండా..
-
Aug 14, 2025 11:24 IST
పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచింది: టీడీపీ నేత లతారెడ్డి
ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: లతారెడ్డి

-
Aug 14, 2025 11:19 IST
పులివెందుల విజయంతో టీడీపీ శ్రేణుల సంబరాలు
-
Aug 14, 2025 11:17 IST
ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి ఆధిక్యం
-
Aug 14, 2025 11:15 IST
పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరిగింది: మంత్రి సవిత
అభివృద్ధి కోసమే ప్రజలు ఈ తరహా తీర్పు ఇచ్చారు: సవిత
వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతాం: సవిత
-
Aug 14, 2025 10:51 IST
కొనసాగుతోన్న ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నిక కౌంటింగ్
ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ముందంజ
-
Aug 14, 2025 10:49 IST
పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

-
Aug 14, 2025 10:48 IST
6,735 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు
-
Aug 14, 2025 10:46 IST
పులివెందుల ZPTC ఉప ఎన్నికలో టీడీపీ విజయం
6,050 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు
లతారెడ్డికి 6,735 ఓట్లు, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు
-
Aug 14, 2025 10:44 IST
కొనసాగుతోన్న పులివెందుల, ఒంటిమిట్ట ZPTC బైపోల్ కౌంటింగ్
కడప పాలిటెక్నిక్ కాలేజ్‌లో కొనసాగుతోన్న కౌంటింగ్
ఒకే రౌండ్‌లో పూర్తికానున్న పులివెందుల ZPTC కౌంటింగ్
2 రౌండ్లలో పూర్తికానున్న ఒంటిమిట్ట ZPTC కౌంటింగ్
పులివెందుల, ఒంటిమిట్ట బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులు
టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ
పులివెందుల 74శాతం, ఒంటిమిట్టలో 86 శాతం ఓటింగ్ నమోదు
మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం