Nara Lokesh: అభివృద్ధికి ఓటేశారు
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:30 AM
పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వెనుకబాటుతనానికి వీడ్కోలు చెప్పి, అభివృద్ధికి ఆహ్వానం పలికారని మంత్రి నారా లోకేశ్ అన్నారు...
వారికి ఒక రోజు ముందే స్వాతంత్య్రం: పల్లా శ్రీనివాస్
ఈ ఫలితాలు జగన్‌కు కనువిప్పు కలిగించాలి: నారాయణ
అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వెనుకబాటుతనానికి వీడ్కోలు చెప్పి, అభివృద్ధికి ఆహ్వానం పలికారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పులివెందులలో తొలిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని, ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లభించిందన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన లతారెడ్డి, కృష్ణా రెడ్డికి లోకేశ్ అభినందనలు తెలిపారు. పులివెందుల ప్రజలకు ఒక రోజు ముందుగానే స్వాతంత్య్రం వచ్చిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేశామని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో తమ అభిప్రాయాలను పంచుకున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఈ ఫలితాలు జగన్‌కు కనువిప్పు కలిగించాలని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ తన తండ్రి వయస్సు ఉన్న చంద్రబాబుని ఏకవచనంతో మాట్లాడటం అత్యంత అభ్యంతరకరమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.