Share News

CM Chandrababu Naidu: సంతృప్తి పెరగాలి!

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:23 AM

వివిధ పథకాల అమలుపై ప్రజల్లో సంతృప్తి శాతం మరింత పెరగాలని స్పష్టమైంది. ప్రభుత్వ పథకాలు, సేవలపై ప్రభుత్వం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ...

CM Chandrababu Naidu: సంతృప్తి పెరగాలి!

  • పెన్షన్ల పంపిణీకి డబ్బుల డిమాండ్‌.. దీపం-2 పథకంలో కూడా ఇంతే

  • ప్రసాదాల్లో నాణ్యతపై 76 శాతం సంతృప్తి

  • రెవెన్యూ సర్వేలో అనేక సమస్యలు

  • ఇసుక అందుబాటుపై 65.6ు సంతృప్తి

  • ఆర్‌టీజీఎస్‌ సర్వే వివరాలు వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వివిధ పథకాల అమలుపై ప్రజల్లో సంతృప్తి శాతం మరింత పెరగాలని స్పష్టమైంది. ప్రభుత్వ పథకాలు, సేవలపై ప్రభుత్వం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్‌టీజీఎస్‌) సర్వే చేపట్టింది. ఆ వివరాలను ఆర్‌టీజీఎస్‌ అధికారులు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబుకు వివరించారు. పెన్షన్ల పంపిణీలో గత త్రైమాసికం(ఏప్రిల్‌-మే-జూన్‌)లో 12.9 శాతం అవినీతి ఉందని.. ప్రస్తుత త్రైమాసికం(జూలై-ఆగస్టు-సెప్టెంబరు)లో కూడా 12.5 శాతం వరకూ ఉన్నట్లు సర్వేలో తేలింది. గత త్రైమాసికంలో 89.4 శాతం మంది ఇంటికి వచ్చి పెన్షన్‌ ఇచ్చారని చెబితే.. ఈ క్వార్టర్‌లో 90.5 శాతం మందికి ఇంటి వద్ద పెన్షన్‌ అందినట్లు స్పష్టమైంది. దీపం-2 పథకంలో అదనంగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని మొదటి త్రైమాసికంలో 38.4 శాతం మంది తెలిపారు. ప్రస్తుత క్వార్టర్‌లో అది 39 శాతానికి పెరిగింది. నడుస్తున్న త్రైమాసికంలో మహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు జరుగుతున్నట్లు 25.6 శాతం మంది చెప్పగా.. వేధింపులు లేవని 74.4 శాతం మంది తెలిపారు. అలాగే మహిళలపై వేధింపుల సమయంలో పోలీసుల స్పందన 65 శాతం కేసుల్లో బాగుందని.. 34 శాతం కేసుల్లో సక్రమంగా స్పందించలేదని తేలింది.

  • గత క్వార్టర్‌లో అధికారుల ప్రవర్తన బాగుందని 86.7ు మంది చెప్పగా.. ఈ క్వార్టర్‌లో కూడా 87.7ు మంది బాగుందన్నారు.

  • ఆలయాల్లో ప్రసాదాల నాణ్యత బాగుందని గత ఏడాది 77ుమంది చెప్పగా ఈ ఏడాది 76ు మందే బాగుందన్నారు.

  • తాజా త్రైమాసికంలో రైతులకు అవసరమైన విత్తనాలు 65 శాతం మందికే అందాయి. 35 శాతం మందికి అందలేదు. నాణ్యత విషయంలో తేడా కనిపించింది. 63ు మంది నాణ్యత బాగుందని, 37 శాతం మంది బాగోలేదని చెప్పారు.

  • ప్రస్తుత క్వార్టర్‌లో.. తమ ప్రాంతాల్లో గంజాయి సమస్య ఉందని 27 శాతం మంది సర్వేలో చెప్పారు. లేదని 73 శాతం మంది తెలిపారు. ఈ విషయంలో పోలీసు స్పందన బాగుందని 57 ు, బాగోలేదని 42ు మంది స్పష్టం చేశారు.

Updated Date - Sep 17 , 2025 | 04:28 AM