Share News

AP Govt: రుషికొండపై ప్రజాభిప్రాయ సేకరణ

ABN , Publish Date - Oct 14 , 2025 | 06:20 AM

గత వైసీపీ ప్రభుత్వం విశాఖ సాగర తీరంలో రుషికొండపై రూ.450 కోట్లతో నిర్మించిన ప్యాలె్‌సను ఎలా వినియోగించాలన్న విషయమై కూటమి ప్రభుత్వం....

AP Govt: రుషికొండపై ప్రజాభిప్రాయ సేకరణ

  • నోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్ర పర్యాటక శాఖ

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం విశాఖ సాగర తీరంలో రుషికొండపై రూ.450 కోట్లతో నిర్మించిన ప్యాలె్‌సను ఎలా వినియోగించాలన్న విషయమై కూటమి ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు దిగింది. దీనిపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ టూరిజం అథారిటీ, టూరిజం కార్పొరేషన్లు తమ వెబ్‌సైట్‌లో అభిప్రాయ సేకరణ ప్రారంభించాయి. ఈ భవనాలను ఎలా ఉపయోగిస్తే బాగుంటుంది? టూరిజం ప్రమోషన్స్‌కు లేదా పీపీపీకి ఇస్తే మంచిదా? ఎకో టూరిజానికి ఉపయోగించాలా? కల్చరల్‌ ఈవెంట్స్‌కు ఉపయోగిస్తే బాగుంటుందా? లేదా ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగిస్తే మేలా? అన్న దానిపై ప్రజలు తమ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను 7 రోజులలోపు టఠటజిజీజుౌుఽఛ్చీః్చఞ్టఛీఛి.జీుఽ మెయిల్‌ చేయాలని పేర్కొన్నాయి.

Updated Date - Oct 14 , 2025 | 06:21 AM