Share News

జగన్‌ భూతాన్ని బయటకు రానీయకూడదు: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:31 AM

జగన్‌ అనే భూతాన్ని బయటకు రానీయకూడదు. 2014-2019 మధ్యలో సీసాలో బంధించి బిరడా పెట్టారు. తర్వాత తీశారు. అపుడు రాష్ట్రంలో ఎంత విధ్యంసం జరిగిందో ప్రజలకు తెలుసు. మరలా అవకాశం ఇవ్వకుండా...

జగన్‌ భూతాన్ని బయటకు రానీయకూడదు: మంత్రి నిమ్మల

తణుకు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ అనే భూతాన్ని బయటకు రానీయకూడదు. 2014-2019 మధ్యలో సీసాలో బంధించి బిరడా పెట్టారు. తర్వాత తీశారు. అపుడు రాష్ట్రంలో ఎంత విధ్యంసం జరిగిందో ప్రజలకు తెలుసు. మరలా అవకాశం ఇవ్వకుండా, ఇప్పుడున్న బిరడా తీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ... రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. రాష్ట్రం కోలుకునే పరిస్థితుల్లో వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. తర్వాత ఎంత విధ్వంసం జరిగిందో అందరికి తెలుసు’ అని అన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 06:32 AM