Share News

Indian Space Research Organisation: జనవరి 10న పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగం

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:48 AM

అమెరికాకు చెందిన భారీ ఉగప్రహం బ్లూబర్డ్‌ ప్రయోగంతో ఈ ఏడాదిని ఘనంగా ముగించిన ఇస్రో.. కొత్త ఏడాది ఆరంభంలోనే మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది..

Indian Space Research Organisation: జనవరి 10న పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగం

  • షార్‌కు చేరిన ఈవోఎస్ -ఎన్‌1 ఉపగ్రహం

సూళ్లూరుపేట, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అమెరికాకు చెందిన భారీ ఉగప్రహం బ్లూబర్డ్‌ ప్రయోగంతో ఈ ఏడాదిని ఘనంగా ముగించిన ఇస్రో.. కొత్త ఏడాది ఆరంభంలోనే మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది..! తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌ నుంచి జనవరి 10న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం నిర్వహించనుంది. ఈ రాకెట్‌ ద్వారా రోదసిలోకి పంపే ఈవోఎస్ -ఎన్‌1 ఉపగ్రహాన్ని శుక్రవారం బెంగళూరు నుంచి భారీ భద్రత నడుమ షార్‌కు తీసుకొచ్చారు. పర్యావరణ పరిశోధన నిమిత్తం ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. వ్యవసాయం, భూ పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ, వాతావరణంపై అధ్యయనాలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. దీంతో పాటు మన దేశంలోని ఓ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన చిన్న ఉపగ్రహం, అమెరికాకు చెందిన మరో బుల్లి ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలోకి పంపనున్నారు. ఇప్పటికే షార్‌లోని వ్యాబ్‌లో పీఎస్ఎల్వీ రాకెట్‌ మూడు దశల అనుసంధాన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షార్‌కు చేరిన ఉపగ్రహాన్ని శాటిలైట్‌ ప్రిపరేషన్‌ బిల్డింగ్‌లో పెట్టి పరీక్షించనున్నారు. అనంతరం పీఎ్‌సఎల్వీ రాకెట్‌కు ఉపగ్రహాన్ని అనుసంధానం చేసి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేస్తారు.

Updated Date - Dec 27 , 2025 | 04:49 AM