Share News

సింగిల్‌ విండో ద్వారా సేవలు అందించండి

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:49 PM

సింగిల్‌విండో సొసైటీ చైర్మన్‌ మెంబర్లుగా ఎన్నికైనవారు అందుబాటులో ఉండి రైతులకు సేవలు అందించాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ సూచించారు.

సింగిల్‌ విండో ద్వారా  సేవలు అందించండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌

దువ్వూరు, ఆగస్ట్టు 21 (ఆంధ్రజ్యోతి): సింగిల్‌విండో సొసైటీ చైర్మన్‌ మెంబర్లుగా ఎన్నికైనవారు అందుబాటులో ఉండి రైతులకు సేవలు అందించాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ సూచించారు. దువ్వూరు పీఏసీఎస్‌ చైర్మన్‌గా గురువారం పోలు రామమోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. పింఛన్లు కొందరికి రాలేదనే ఆందోళన పడవద్దని తెలిపారు. వారి అర్హతకు సంబందించిన పత్రాలను చూపితే తిరిగి పింఛను మంజూరవుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీవో వెంకటసుబ్బయ్య, అసిస్టెంట్‌ రిజిసా్ట్రర్‌ రాజేశ్వరరావు, తెదేపా మండల కన్వీనర్‌ బోరెడ్డి వెంకటరమణారెడి ్డ, ఆ పార్టీ నాయకులు గురివిరెడ్డి, రాంబాబు, అందె శ్రీనివాసులు, పాల్గొన్నారు.

మైదుకూరు సహకార చైర్మన్‌గా పాశం మారుతి

మైదుకూరు రూరల్‌, ఆగస్ట్టు 21 (ఆంధ్రజ్యోతి) :మైదుకూరు సిండికేట్‌ రైతు సేవా సహకార సంఘం చైర్మన్‌ గా పాశం మారుతి కుమార్‌ గురువా రం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావే శంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సిండికే ట్‌ బ్యాంకు వలన రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. అనంతరం సహకార సంఘం చైర్మన్‌ మారుతికుమార్‌ మాట్లాడుతూ ,సిండికేట్‌ బ్యాంకును లాభాలతో మరింత ముందుకు నడిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరిబాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏపీ రవీంద్ర, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్‌ యాపరాల చిన్న, సిండికేట్‌ బ్యాంకు చైర్మన్‌ పాశం మారుతి, మిల్లు శ్రీను, పుట్టా ప్రభాకర్‌యాదవ్‌, పార్టీ ఉపాధ్యక్షుడు యాపరాల లక్ష్మినారాయణ, బండి అమర్‌నాథ్‌, తుపాకుల రమణ, ధన పాల రవి, గుండంరాజు సుబ్బయ్య, శీర్ల నాగ మోహన్‌, మేకల బాబు, నారాయణ పిచ్చపాటి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 11:49 PM