Share News

నాణ్యమైన భోజనం అందించాలి

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:02 AM

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఏపీ ఫుడ్‌ కమిషన చైర్మన విజయప్రతాప్‌రెడ్డి సూచించారు.

నాణ్యమైన భోజనం అందించాలి
బనగానపల్లె బాలికల ఉన్నత పాఠశాలలో ఏపీ ఫుడ్‌ కమిషన చైర్మన

బనగానపల్లె, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఏపీ ఫుడ్‌ కమిషన చైర్మన విజయప్రతాప్‌రెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్న త పాఠశాలలను తనిఖీ చేశారు. పట్టణంలోని 4వ చౌకదుకాణాన్ని తనిఖీ చేసి సరుకు రిజిస్టర్లను తనిఖీ చేసి డీలర్లతో సమావేశమయ్యారు. ప్రస్తు తం ఎండీయూ వాహనాల వల్ల కలిగే ఇబ్బందులను గురించి డీలర్లు ఆయనకు వివరించారు. అలాగే పట్టణంలోని సివిల్‌ సప్లై గోడౌనను తనిఖీ చేశారు. రేషన స్టాకు రిజిస్టర్‌ను పరిశీలించారు. గోదాములోని రేషన బస్తాలను పరిశీలించారు. అనంతరం యనకండ్ల ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పిల్లలకు అందించే గుడ్లు, పౌష్ఠికాహారం గురించి ఆరా తీశారు. అనంతరం పిల్లలకు ఇచ్చే పౌష్ఠికాహారం, గుడ్ల సైజును స్వయంగా పరిశీలించారు. నందివర్గంలోని జడ్పీ ఉన్నత పాఠశా లను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, మెనూను స్వయంగా పరిశీలించారు. ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల తో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన వెంట తహసీ ల్దారు నారాయణరెడ్డి, సివిల్‌సప్లై డిప్యూటీ తహసీల్దారు నారాయణరెడ్డి, ఎంఈవో స్వరూప, హెచఎంలు బాలగంగాధర్‌రెడ్డి, హెచఎం రామకృష్ణ, ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:02 AM