Share News

AP Assembly: మండలిలో ప్రొటోకాల్‌ వివాదానికి తెర

ABN , Publish Date - Sep 28 , 2025 | 05:37 AM

మండలి చైర్మన్‌కు అవమానం జరిగిందన్న వివాదం ఎట్టకేలకు ముగిసింది. తిరుపతిలో మహిళా పార్లమెంటరీ సదస్సుకు, అసెంబ్లీ ప్రాంగణంలో విప్‌ల భవన ప్రారంభోత్సవానికి మండలి చైర్మన్‌...

AP Assembly: మండలిలో ప్రొటోకాల్‌ వివాదానికి తెర

  • పొరపాటే.. ఉద్దేశపూర్వకం కాదు: మంత్రి కేశవ్‌

  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: విపక్ష నేత బొత్స

  • అధికార, విపక్ష సభ్యులకు చైర్మన్‌ ధన్యవాదాలు

  • కాఫీ, టీల విషయంలో తేడా రాకుండా చూస్తామన్న మంత్రి

అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): మండలి చైర్మన్‌కు అవమానం జరిగిందన్న వివాదం ఎట్టకేలకు ముగిసింది. తిరుపతిలో మహిళా పార్లమెంటరీ సదస్సుకు, అసెంబ్లీ ప్రాంగణంలో విప్‌ల భవన ప్రారంభోత్సవానికి మండలి చైర్మన్‌ మోషేన్‌రాజును ఆహ్వానించకుండా అగౌరవపర్చారని శుక్రవారం మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఇదే అంశంపై శనివారం వైసీపీ సభ్యులు నల్ల కం డువాలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. మండలిలో ఆందోళన దిగారు. చైర్మన్‌కు జరిగిన అవమానానికి ఉభయ సభల నాయకుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో చైర్మన్‌ను అవమానించాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ వివరణ ఇచ్చారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరక్కుండా చూస్తామని చెప్పడంతో వివాదానికి తెరపడింది. తొలుత సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి మండలి చైర్మన్‌కు జరిగిన అవమానంపై సభానాయకుడు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సభాపతి గౌరవాన్ని, రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ‘మీ డిమాండ్‌ చెప్పారు.. ప్రభుత్వం తరుపు న మంత్రి చెప్పేది వినండి’ అని చైర్మన్‌ సూచించారు. మంత్రి కేశవ్‌ మాట్లాడుతూ ‘చైర్మన్‌ను పిలవకూడదు.. పేర్లు వేయకూడదన్న ఆలోచనలు ప్రభుత్వానికి లేవు. ఎక్కడ పొరపాటు జరిగిందో చూసి, పూర్తి వివరాలతో మీ దగ్గరకు వస్తాం. భవిష్యత్‌లో ఇలాంటివి జరక్కుండా చూ స్తాం.


ఈ విషయాన్ని మీకు, మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం. జీఎస్టీ బిల్లు, నాలా బిల్లు, ఇతర ప్రభుత్వ బిల్లుల్ని ఆమోదించాలని కోరుతున్నా.’ అని చెప్పారు. విపక్ష నేత బొత్స మాట్లాడుతూ ‘ఇలా రిపీటెడ్‌గా జరుగుతోంది. ఒకటి రెండు సార్లైతే సర్దుకోవ చ్చు. జీఎస్టీ బిల్లుకు మేం వ్యతిరేకం కాదు. రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే తప్ప.. బిల్లులకు మేం వ్యతిరేకం కాదు. కానీ దీనికి ఫుల్‌స్టాప్‌ పడాలి. మాకు చర్చ ముఖ్యం కాదు. ప్రభుత్వం నుంచి సమాధానం కావా లి’ అని అన్నారు. మంత్రి కేశవ్‌ జోక్యం చేసుకుని ‘చైర్మన్‌ను పిలవకూడదనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. పొరపాటు జరిగిందే తప్ప.. ఉద్దేశపూర్వకంగా జరగలేదు. సభాపతి కుర్చీని గౌరవిస్తాం’ అని వివరణ ఇచ్చారు. చైర్మ న్‌ మోషేన్‌రాజు జోక్యం చేసుకుని వ్యవస్థల్ని, సమా జాన్ని గౌరవించాలని హి తవు పలికారు. నా వ్యక్తిగత ప్రొటోకాల్‌ విషయం లో దురదృష్టకరమైన పరిస్థితిని విపక్ష సభ్యులు గుర్తించి, సభలో ప్రస్తావించడం, దీనిపై సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి, ప్రతిపక్ష సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికారు.


కాఫీ, టీల్లోనూ వ్యత్యాసం: బొత్స

శాసనమండలిలో సభ్యులకిచ్చే కాఫీ విషయా న్ని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రస్తావించా రు. ‘ఒకసారి క్యాంటీన్‌కు వెళ్లండి అధ్యక్షా.. ఎమ్మెల్యేల క్యాంటీన్‌ను, ఎమ్మెల్సీల క్యాంటీన్‌ను పరిశీలించండి. ఎమ్మెల్సీలకిచ్చే కాఫీలోనూ వ్యత్యాసం చూ పుతున్నారు’ అని చెప్పారు. మంత్రి కేశవ్‌ జోక్యం చేసుకుని ‘సభ దృష్టికి విపక్ష నేత కొన్ని విషయాలు తీసుకొచ్చారు. నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఒకే కాం ట్రాక్టర్‌ అసెంబ్లీకి, మండలికి సరఫరా చేస్తున్నారు. కాఫీ, టీ, టిఫిన్‌, భోజనం అందిస్తున్నారు. ఇందులో వ్యత్యాసం ఉందని చెప్తుంటే అనుమానం వస్తోంది. అలా ఉంటుందని అనుకోవట్లేదు. ఏం జరుగుతున్నదో ఆరా తీస్తాం. ఉద్ధేశపూర్వకంగా జరగదు. తప్పు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం’ అన్నారు. చైర్మన్‌ మాట్లాడుతూ ‘సభ్యులు ఈ విషయాన్ని ఒకసారి నా దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కాఫీ, టీలు వేర్వేరుగా పెట్టొద్దని సెక్రటరీకి చెప్పా. అక్కడ వేరే కాఫీ, గ్రీన్‌ టీ పెట్టి, ఇక్కడ పెట్టకపోవడం సరికాదని చెప్పా. పద్ధతి మారట్లేదు’ అన్నారు. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది... ఇకపై అలా జరక్కుండా చూస్తాం అని మంత్రి కేశవ్‌ చెప్పారు.


సభకు వచ్చేది టీ.. కాఫీ కోసమా!

సమస్యలపై చర్చ చేయరా?: సంధార్యాణి

కాఫీ, టీ కోసం మం డలిలో వైసీపీ సభ్యులు దెబ్బలాడటం దౌర్భాగ్యమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించా రు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘వైసీపీ హయాంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. అప్పుడు అత్యంత అవమానకరంగా నా హ్యాండ్‌ బ్యాగ్‌ను చింపి మరీ తనిఖీలు చేసేవారు. ఓ మహిళా సభ్యురాలి హ్యాండ్‌ బ్యాగ్‌ను తనిఖీ చేయడం ప్రొటోకాల్‌ అవుతుందా? అలాంటి దుర్మార్గాల కు పాల్పడిన వైసీపీ ఇప్పుడు కాఫీ, టీ కోసం గొడవ పడుతూ విలువైన ప్రజాసమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’ అని అన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 05:39 AM