Share News

వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ

ABN , Publish Date - May 26 , 2025 | 12:05 AM

వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు వ్యతి రేకంగా పట్టణంలో ఆదివారం ముస్లింలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు.

 వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ
ఆళ్లగడ్డలో ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లిం సంఘాల నాయకులు

ఆళ్లగడ్డ, మే 25(ఆంధ్రజ్యోతి) : వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు వ్యతి రేకంగా పట్టణంలో ఆదివారం ముస్లింలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆదేశాల మేరకు ఆళ్లగడ్డలో ముస్లింలు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌ మీదుగా నాలుగు రోడ్ల కూడలి, ఆర్టీసీ బస్టాండ్‌ వరకు జాతీయ పతాకాలతో పాటు నల్ల జెండాలను ధరించి నిరసన చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో మా నవహారంగా ఏర్పడి వక్ఫ్‌ సవరణ బిల్లును రద్దు చేయాలని కోరుతూ ప్ల కార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జామియా మర్కస్‌ పాత మసీదు ఇమామ్‌, మండల ప్రభుత్వ ఖాజీ జాఫర్‌ మహమ్మద్‌ సాధిక్‌, వివిధ ప్రాంతాల ముస్లింలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 12:05 AM