Share News

తాగునీటికోసం నిలదీత

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:02 AM

):మండలంలోని అప్పారావుపేట, చిన్నకోడూరుల్లో తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని అప్పారావుపేట స్వయంశక్తి సంఘాల మహిళలు ఎంపీడీవో జి.రవికుమార్‌, డిప్యూటీ ఎంపీడీవో బి.పద్మావతి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శ్రీనివాసరావును శుక్రవారం నిలదీశారు. బీజేపీ నాయకులు చింతాడభారతి, యువజన నాయకులు ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈని ఫోన్‌ చేయగా అప్పారావుపేట కాలనీకి చేరుకోగా మహిళలంతా చుట్టుముట్టారు.

తాగునీటికోసం నిలదీత
ఎంపీడీవోను నిలదీస్తున్న అప్పారావుపేట కాలనీ మహిళలు:

పోలాకి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి):మండలంలోని అప్పారావుపేట, చిన్నకోడూరుల్లో తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని అప్పారావుపేట స్వయంశక్తి సంఘాల మహిళలు ఎంపీడీవో జి.రవికుమార్‌, డిప్యూటీ ఎంపీడీవో బి.పద్మావతి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శ్రీనివాసరావును శుక్రవారం నిలదీశారు. బీజేపీ నాయకులు చింతాడభారతి, యువజన నాయకులు ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈని ఫోన్‌ చేయగా అప్పారావుపేట కాలనీకి చేరుకోగా మహిళలంతా చుట్టుముట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ పోలాకి నుంచి నీటిక్యాన్‌రూ.20 చెల్లించి కొనుగోలు చేస్తున్నామని వాపోయారు. ఈకార్యక్రమంలో అప్పారావుపేట, చిన్నకోడూరు కాలనీ యువజన నాయకులు, వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:02 AM