మహిళ ఏపీఎంపై దాడికి నిరసన
ABN , Publish Date - Aug 14 , 2025 | 10:40 PM
గుర్రంకొండ మండలానికి చెందిన మహిళ ఏపీఎం రజనికుమారిపై దాడిని ఖండిస్తూ గురువారం వాల్మీకిపురం మండల వెలు గు (సెర్ఫ్) ఉద్యోగులు కార్యాలయ ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
వాల్మీకిపురం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): గుర్రంకొండ మండలానికి చెందిన మహిళ ఏపీఎం రజనికుమారిపై దాడిని ఖండిస్తూ గురువారం వాల్మీకిపురం మండల వెలు గు (సెర్ఫ్) ఉద్యోగులు కార్యాలయ ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి ధనుంజయరెడ్డి మా ట్లాడుతూ ఇలాంటి దుశ్చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. విధులు నిర్వహిస్తున్న మహిళ ఏపీఎంపై మూకుమ్మడిగా నడిరోడ్డుపై దాడి చేయడం దారుణమన్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన చేశారు.కలెక్టర్, ఎస్పీలు కఠిన చర్యలు చేపట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళ ఏపీఎంకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నేతలు సురేంద్ర, రెడ్డెప్ప, జిల్లా నేతలు నరోత్తమరెడ్డి, అనురాధ, శంకరయ్య, శ్రీనివాసులు, వెంకటపతి, భారతి, మహేశ్వరి, సుబ్రహ్మణ్యం, వెంకటరమణ, తులసి, రాజగోపాల్, బాబాసాహెబ్, ఆంజనేయులు, సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.
నిందితులను శిక్షించాలి
గుర్రంకొండ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): మహిళా సమాఖ్య ఏపీఎం రజనీకుమారిపై దాడికి పాల్ప డిన వారిని కఠినంగా శిక్షించాలని సంఘమిత్రా లు నిరసన వ్యక్తం చేశారు. గురువారం అన్ని గ్రామాల సంఘమిత్రాలు స్థానిక కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సంఘమిత్రలు ప్రమీ ల, అనిత, లలిత, శారద, రోజా, సరస్వతి, లక్ష్మీదే వి, నందినీ, శిరీషా, పుష్ప, ఉష రాణి, భాస్కర్, శ్రీరాముల రెడ్డి, రెడ్డెమ్మ, షమి మునీషా, పావ ని, రామాంజులమ్మ, కళ్యాణి పాల్గొన్నారు.