Share News

CM Chandrababu: కొండపల్లి బొమ్మలను కాపాడుదాం

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:07 AM

కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు మన సంస్కృతీ సంప్రదాయాలు. వాటిని కాపాడుకోవాలి’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు..

CM Chandrababu: కొండపల్లి బొమ్మలను కాపాడుదాం

‘కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు మన సంస్కృతీ సంప్రదాయాలు. వాటిని కాపాడుకోవాలి’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజున కొండపల్లి బొమ్మల తయారీకి వాడే కలపకు అటవీ శాఖ నుంచి సమస్యలు వస్తున్నాయని, కొయ్య ధరలు పెరగడంతో కళాకారుల మనుగడకు ముప్పువాటిల్లుతోందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ కొండపల్లి కొయ్యబొమ్మలు, ఏటికొప్పాక కళాకృతులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ శాఖతో మాట్లాడి కళాకారులకు తక్కువ ధరకు కలప అందేలా చూడాలని ఆదేశించారు. బొమ్మల తయారీకి వాడే కలప మొక్కలను ప్రైవేటు భూముల్లోనూ పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 04:07 AM