Irrigation Users Association: కృష్ణా జలాల్లో ఆంధ్ర హక్కులను కాపాడండి
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:26 AM
కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి హక్కులను కాపాడాలని రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య విజ్ఞప్తి చేసింది.
బోర్డు చైర్మన్‌ను కోరిన సాగునీటి వినియోగదారుల సంఘం
అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి హక్కులను కాపాడాలని రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. శనివారం పులిచింతల ప్రాజెక్టును కేఆర్‌ఎంబీ చైర్మన్ బీజీ పాండే సందర్శించారు. ఆ సందర్భంగా పాండేను సమాఖ్య చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో సభ్యులు కలిశారు. చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయించింది. అయితే తమకు 904 టీఎంసీల కృష్ణా జలాలను ఇవ్వాలంటూ తెలంగాణ కోరడం దుర్మార్గం. కేటాయింపుల్లో మార్పులు చోటు చేసుకుంటే మొత్తం 30 లక్షల ఎకరాలు సాగునీరు అందక ఎడారిగా మారతాయి. కృష్ణా జలాల్లో ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం వాటాలను యఽథాతథంగా కొనసాగించాలి. నీటి విడుదల గడువును వచ్చేనెల 20 దాకా పెంచాలి’ అని కేఆర్‌ఎంబీ చైర్మన్‌ను కోరామని గోపాలకృష్ణ తెలిపారు.