Share News

Certification Lab: అమరావతిలో కొత్త సాంకేతికతల సర్టిఫికేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయండి

ABN , Publish Date - May 28 , 2025 | 06:17 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ సర్కారు అమరావతిలో కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికాల కోసం సర్టిఫికేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మন্ত্রী ప్రహ్లాద్‌ జోషి దీనిపై సానుకూల స్పందన తెలియజేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Certification Lab: అమరావతిలో కొత్త సాంకేతికతల సర్టిఫికేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయండి

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి నాదెండ్ల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, మే 27(ఆంధ్రజ్యోతి): అమరావతిలో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ (కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికలు) కోసం ఒక సర్టిఫికేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కోరామని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. తమ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి అధ్యక్షతన బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) గవర్నింగ్‌ కౌన్సిల్‌ 9వ సమావేశం జరిగింది. అనంతరం మనోహర్‌ మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో మత్స్య, హార్టికల్చర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను విస్తరించి, ఫుడ్‌ కంట్రోలింగ్‌ ల్యాబ్‌ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరామని తెలిపారు.

Updated Date - May 28 , 2025 | 06:17 AM