ప్రాణం తీసిన ఆస్తి తగాదా
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:54 PM
ఆస్తి తగాదా ఓ ప్రాణం తీసింది. వివరాలివీ.. మోతుకూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకటశివమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు.
తల్లి చేతిలో చనిపోయిన కుమారుడు
వెలుగోడు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆస్తి తగాదా ఓ ప్రాణం తీసింది. వివరాలివీ.. మోతుకూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకటశివమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిద్దరికీ ఆస్తి పంపకాలు చేశారు. అయితే రిజిసే్ట్రషన ఇంకా చేయించలేదు. పెద్ద కుమారుడు సుధాకర్ (36) తన వాటాకు వచ్చిన భూమి తన పేరున రిజిస్టరు చేయించాలని ఆదివారం రాత్రి తల్లితో గొడవపడ్డాడు. తనకు అనారోగ్యం ఉందని, అప్పులు ఉన్నాయని, పొలం తన పేరిట రిజిసే్ట్రషన చేయిస్తే, పొలం అమ్మి అప్పులు చెల్లిస్తానని తల్లి వెంకటశివమ్మతో గొడవ పడ్డాడు. ఈ నేపఽథ్యంలో తోపులాట జరిగి సుధాకర్ కింద పడ్డాడు. వెంటనే సుధాకర్‌ను ఆసుపత్రికి తరలిస్తూ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. తన భర్తను తన అత్త వెంకటశివమ్మ హత్య చేసిందని సుధాకర్ భార్య జ్యోతి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ సురేశ తెలిపారు.