Share News

Jagan: సంపద సృష్టిస్తామన్నారు.. అప్పులు చేశారు

ABN , Publish Date - Aug 24 , 2025 | 06:24 AM

2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన నేతలు పదేపదే అబద్ధాలు చెప్పారు. రాష్ట్రంలో ఆదాయ వృద్ధి తగ్గిందని, అభివృద్ధి లేదనీ తప్పుడు ప్రచారం చేశారు.

 Jagan: సంపద సృష్టిస్తామన్నారు.. అప్పులు చేశారు

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ నివేదికలు ఆందోళనకరం:జగన్‌

అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ‘2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన నేతలు పదేపదే అబద్ధాలు చెప్పారు. రాష్ట్రంలో ఆదాయ వృద్ధి తగ్గిందని, అభివృద్ధి లేదనీ తప్పుడు ప్రచారం చేశారు. కూటమి అధికారంలోనికి వస్తే సంపద సృష్టిస్తామని నమ్మబలికారు. కానీ, రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోయి అప్పులు పెరిగినట్లుగా కంపోట్ర్‌లర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలు వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. 2024-25లో కేంద్ర ప్రభుత్వ ఆదాయాభివృద్ధి 12.04 శాతం భారీగా పెరిగితే.. రాష్ట్ర ఆదాయ వృద్ధి 3.08 శాతం వద్దే ఎందుకు ఆగిపోయింది? ప్రజల కొనుగోలు శక్తి కూడా బాగా తగ్గిపోయింది. కూటమి అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ఆదాయం వృద్ధి 2.39 శాతం మాత్రమే ఉంది. మా ప్రభుత్వ హయాంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.3,32,671 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వంఈ 14నెలల్లోనే రూ.1,86,361 కోట్లు అప్పు చేసింది’ అని పేర్కొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 07:04 AM