Telugu writer: ప్రముఖ కథా రచయిత కోడూరి శ్రీరామమూర్తి అస్తమయం
ABN , Publish Date - Aug 06 , 2025 | 06:03 AM
ప్రముఖ కథా రచయిత, సాహిత్య విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తి మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో ఆయన స్వగృహంలో కన్నుమూశారు.
రాజమహేంద్రవరం కల్చరల్, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కథా రచయిత, సాహిత్య విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తి మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో ఆయన స్వగృహంలో కన్నుమూశారు. శ్రీరామమూర్తి లిటరరీ కాలమిస్టుగా, సమకాలీన ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను విశ్లేషిస్తూ దినపత్రికల్లో వ్యాసాలు రాసే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా, వేలాది సాహితీ విమర్శనా వ్యాసాలు రాసిన సాహితీ విమర్శకుడిగా పలువురి మన్ననలను పొందారు. తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ పుస్తకం 1978లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా పురస్కారం పొందింది. తెలుగు కథ... నాడు-నేడు పుస్తకం 2007లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ సాహిత్య విమర్శనా గ్రంథంగా పురస్కారం పొందింది. కాగా ఇటీవల ఆయన రాసిన ‘రచయితగా మహాత్ముడు’, ‘మహాత్ముని అడుగుజాడలు’ పుస్తకాలను ప్రముఖ వైద్యుడు, అభ్యుదయవాది డాక్టర్ చెలికాని స్టాలిన్ ఈ ఏడాది ఏప్రిల్ 28న ఆవిష్కరించారు.