YSRCP rally: వైసీపీ ర్యాలీలో ప్రైవేటు విద్యార్థులు
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:17 AM
కర్నూలు జిల్లా కేంద్రంలో వైసీపీ నిర్వహించిన కోటి సంతకాల ర్యాలీలో ఒక ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు తరలిరావడం చర్చనీయాంశమైంది. ....
కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కేంద్రంలో వైసీపీ నిర్వహించిన కోటి సంతకాల ర్యాలీలో ఒక ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు తరలిరావడం చర్చనీయాంశమైంది. సోమవారం కర్నూలు నగరంలోని రాజ్‌విహార్ నుంచి వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన ఓ కార్పొరేట్ కళాశాల విద్యార్థులు వైసీపీ జెండాలను చేత పట్టుకుని తిరిగారు. ఇదిలా ఉండగా ర్యాలీకి వచ్చిన కళాశాల విద్యార్థుల చేతికి పార్టీ జెండాలు బలవంతంగా ఇచ్చి, ర్యాలీలో పాల్గొనేలా వైసీపీ నాయకులు వ్యవహరించారని సమాచారం. ఇదే అంశంపై నగరవ్యాప్తంగా చర్చ సాగుతోంది.