Share News

ఆదరణలో మత్స్యకారులకు ప్రాధాన్యం: సవిత

ABN , Publish Date - Aug 20 , 2025 | 05:51 AM

రాష్ట్రంలో మత్స్యకారులను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యం. ఆదరణ 3.0లో మత్స్యకారులకు ప్రాధాన్యమిస్తాం అని మంత్రి ఎస్‌.సవిత తెలిపారు.

ఆదరణలో మత్స్యకారులకు ప్రాధాన్యం: సవిత

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో మత్స్యకారులను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యం. ఆదరణ 3.0లో మత్స్యకారులకు ప్రాధాన్యమిస్తాం’ అని మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. ఆమెను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ కొల్లు పెద్దిరాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ‘మత్స్యకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేర్చుతున్నారు. వేటకు కావాల్సిన ఆధునిక పరికరాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వేట విరామ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేసి ఇస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబరు 217ను రద్దు చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదే’ అని సవిత అన్నారు.

బీసీ డీ ధ్రువీకరణ పత్రాలతో నగరాలకు మేలు

రాష్ట్రంలో నగరాల కులానికి చెందిన వారి అభివృద్ధికి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని మంత్రి సవిత తెలిపారు. క్యాంప్‌ కార్యాలయంలో నగరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ మరుపిళ్ల తిరుమలేశ్‌ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘నగరాలు అందరికీ ఒకేలా బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు అందుకునే అవకాశం కలిగిందన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 05:53 AM