Marri Shashidhar Reddy: బనకచర్ల ప్రాజెక్ట్‌కన్నా ఫోర్ వాటర్స్ కాన్సెప్ట్‌కు ప్రాధాన్యమివ్వండి
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:43 AM
బనకచర్ల ప్రాజెక్ట్ కన్నా ఫోర్ వాటర్స్ కాన్సెప్ట్ (ఎఫ్‌డబ్ల్యూసీ)కు ప్రాధాన్యమివ్వాలని ఏపీ సీఎం చంద్రబాబుకు మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్...
ఈ విధానంతో ఏడాదికి మూడు పంటలకు నీళ్లివ్వొచ్చు
సీఎం చంద్రబాబుకు మర్రి శశిధర్‌రెడ్డి లేఖ
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): బనకచర్ల ప్రాజెక్ట్ కన్నా ఫోర్ వాటర్స్ కాన్సెప్ట్ (ఎఫ్‌డబ్ల్యూసీ)కు ప్రాధాన్యమివ్వాలని ఏపీ సీఎం చంద్రబాబుకు మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి మర్రి శశిధర్‌రెడ్డి సూచించారు. ఈమేరకు ఆయనకు లేఖ రాశారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు లేఖ రాశానని.. రేవంత్‌రెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేదని, చంద్రబాబు చర్చలకు పిలిస్తే ఈ విధానంపై వివరించడానికి సిద్ధంగా ఉన్నానని శశిధర్‌రెడ్డి చెప్పారు. ఎఫ్‌డబ్ల్యూసీ వల్ల ఏడాదిలో మూడు పంటలకు నీటిని అందించవచ్చన్నారు. తెలంగాణ, రాజస్థాన్‌లో ఈ విధానం వల్ల స్థిరమైన ఫలితాలు వచ్చాయన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఫోర్ వాటర్ కాన్సెప్ట్ విధానం దేశానికి గొప్ప వరం అవుతుందన్నారు.