AP CM Chandrababu: డ్రోన్ సిటీకి ప్రధానితో శంకుస్థాపన
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:14 AM
ప్రధాని నరేంద్ర మోదీతో డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
16 నాటికి తగిన ఏర్పాట్లు చేయాలి: సీఎం చంద్రబాబు
డిసెంబరులో డ్రోన్‌షో నిర్వహించాలి
క్యూఆర్ కోడ్‌తో కూడా ప్రజాభిప్రాయ సేకరణ
సీసీ కెమెరాలను సమర్థంగా వాడుకోవాలి
ప్రభుత్వ శాఖల పనితీరుపై నెలవారీ ఆడిట్
ఆర్టీజీఎస్, పౌర సేవల సమీక్షలో సీఎం ఆదేశం
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీతో డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డిసెంబరులో డ్రోన్ షోను నిర్వహించాలని సూచించారు. సోమవారం రియల్‌టైమ్ గవర్నెన్స్, పౌరసేవలపై సీఎం సమీక్ష నిర్వహించారు. కర్నూలు, శ్రీశైలం పర్యటనకు ఈనెల 16న ప్రధాని మోదీ వస్తున్నందున, ఆ సందర్భంగా డ్రోన్ సిటీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.