మోదీ అభినవ గాడ్సే: షర్మిల
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:00 AM
బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని నరేంద్ర మోదీ అభినవ గాడ్సే. నాథూరామ్‌కి వారసుడు అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని నరేంద్ర మోదీ అభినవ గాడ్సే. నాథూరామ్‌కి వారసుడు’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ‘నాడు గాడ్సే మహాత్ముడిని భౌతికంగా హత్య చేస్తే... నేడు బాపూజీ పేరు తొలగించి గాంధీజీ ఆశయాలను, స్వాతంత్య్రపు లక్ష్యాలను, నేర్పిన సిద్ధాంతాలను తుడిచిపెట్టి మోదీ మరో హత్య చేస్తున్నారు. ఉపాధి హామీ పథకానికి జాతిపిత పేరు మార్చాలని చూడడం దేశ ద్రోహపు చర్యే. రాష్ట్ర ఎంపీలు పార్టమెంటులో ఈ బిల్లును వ్యతిరేకించాలి’ అని మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కాగా.. మహాత్మాగాంధీ పేరంటే అంత ద్వేషమెందుకని ప్రధాని మోదీని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ప్రశ్నించారు.