Share News

Cultural Heritage: తెలుగులోనే ప్రాథమిక విద్యా బోధన

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:01 AM

తెలుగు భాషకు ఇంకా గుర్తింపు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర పర్యాటక, సాం స్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం ఉన్నత.....

Cultural Heritage: తెలుగులోనే ప్రాథమిక విద్యా బోధన

  • కడియం ఉన్నత పాఠశాలలో కవుల విగ్రహావిష్కరణలో మంత్రి దుర్గేష్‌

కడియం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): తెలుగు భాషకు ఇంకా గుర్తింపు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర పర్యాటక, సాం స్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం ఉన్నత పాఠశాలలో సోమవారం వెలుగుబంటి రామచంద్రరావు చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు ప్రసాద్‌ ఆధ్వర్యంలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి, దువ్వూ రి సుబ్బమ్మ విగ్రహాలను ఆవిష్కరించి మాటా ్లడారు. ప్రాథమిక విద్యబోధన మాతృభాషలోనే కొనసాగించేందుకు ప్రభుత ్వం కట్టుబడి ఉందని తెలిపారు. కడియంలో కవి చెళ్లపిళ్ల, రాజమహేంద్రవరంలో గురజాడ అప్పారావు ఇంటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. మానవ జీవితంలో ఉండే నవరస భరిత విఽధానాలను కళ్లకు కట్టినట్టు చూపే నాటకం కురుక్షేత్రమని.. ఆ నాటకానికి చావులేదని.. ప్రజలంతా ఆనందించేలా మక్కువ తీసుకు రావడానికి కారణం తిరుపతి వేంకటకవులు రాసిన పద్యాలేనని మంత్రి వెల్లడించారు. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాకు సంబంధించి ఓ విభాగాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పా టు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ పరభాష వ్యామోహంలో పడి ఆంగ్ల భాష నేర్చుకోకపోతే మన పిల్లలకు భవిష్యత్‌ లేదని తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారన్నారు. స్వాత ంత్య్ర పోరాటంలో జైలు కెళ్లిన మొట్టమొదటి మహిళ దువ్వూరి సుబ్బమ్మ అందరికీ స్ఫూర్తిదాయకమని తెలి పారు. రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ఎందరో కవులకు, కళాకారులకు జన్మనిచ్చిన జిల్లా తూర్పుగోదావరి అని.. ఈ ప్రాంతం సాహితీ ప్రక్రియకు మారుపేరని చెప్పారు.

Updated Date - Dec 16 , 2025 | 03:01 AM