Religious Discrimination: దళితులకు ప్రవేశం లేదంటూ... గుడికి తాళం వేసిన పూజారి
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:01 AM
గ్రామదేవత గుడిలోకి దళితులకు ప్రవేశం లేదంటూ పూజారి ఆలయానికి తాళం వేశారు. ఈ ఘటన తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పాలెంపాడులో...
తిరుపతి జిల్లా పాలెంపాడులో ఘటన.. పోలీసుల జోక్యంతో సర్దుబాటు
దొరవారిసత్రం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): గ్రామదేవత గుడిలోకి దళితులకు ప్రవేశం లేదంటూ పూజారి ఆలయానికి తాళం వేశారు. ఈ ఘటన తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పాలెంపాడులో ఆదివారం చోటుచేసుకొంది. పాలెంపాడులోని గ్రామదేవత కోరిందమ్మ పరమేశ్వరికి పూజలు చేసుకునేందుకు దళితకాలనీకి చెందిన కొన్ని కుటుంబాల వారు వెళ్లారు. గుడి ముందు పొంగళ్లు పెట్టుకున్నారు. ఈసందర్భంలో నైవేద్యాలు సమర్పించేందుకు గుడిలోపలికి రాకూడదని గుడి పూజారి బట్టా రమణయ్య వారికి చెప్పారు. దళితులమని వివక్ష చూపుతారా అంటూ వీరు ఆగ్రహం వ్యక్తంచేయడంతో.. ఆలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. దళితులు ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ అజయ్‌కుమార్ గుడి వద్దకు వెళ్లి, పూజారిని పిలిపించి తలుపులు తీయించారు. దళితకాలనీవాసులు గుడిలో పూజలు చేసుకొనేలా అవకాశం కల్పించారు. గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని ఎస్‌ఐ చెప్పారు.