President Tour: 17న గోల్డెన్ టెంపుల్‌కు రాష్ట్రపతి రాక
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:18 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న తమిళనాడు రాష్ట్రం వేలూరు శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకోనున్నారు.
తిరుపతి(కలెక్టరేట్), డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న తమిళనాడు రాష్ట్రం వేలూరు శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకోనున్నారు. ఆ రోజు ఉదయం 9.25 గంటలకు మైసూరు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.15 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి 10.25 గంటలకు వాయుసేన హెలికాప్టర్‌లో శ్రీపురం వెళ్లి గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 12.35 గంటలకు శ్రీపురం హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 1.15 గంటలకు తిరుపతికి.. అక్కడ్నుంచి 1.25 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రాష్ట్రపతి బయలుదేరనున్నారు. అక్కడ బొల్లారంలోని విడిది కేంద్రానికి ఆమె చేరుకుంటారు.