Share News

Chinturu-Maredumilli Accident: బాధాకరం.. బాధితులను ఆదుకుంటాం

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:46 AM

చింతూరు- మారేడుమిల్లి ఘాట్‌రోడ్‌ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.

Chinturu-Maredumilli Accident: బాధాకరం.. బాధితులను ఆదుకుంటాం

  • రాష్ట్రపతి, ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం

న్యూఢిల్లీ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): చింతూరు- మారేడుమిల్లి ఘాట్‌రోడ్‌ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. బస్సు ప్రమాద ఘటన గురించి తెలుసుకుని బాధపడ్డానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి ముర్ము ‘ఎక్స్‌’లో తెలిపారు. ’’బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం బాధాకరం. బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.

Updated Date - Dec 13 , 2025 | 05:46 AM