Share News

అశ్వవాహనంపై ప్రహ్లాదరాయలు

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:40 PM

వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు ఆశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

   అశ్వవాహనంపై ప్రహ్లాదరాయలు
అశ్వవాహనుడైన ప్రహ్లాదరాయలకు ఊంజల సేవ చేస్తున్న పీఠాధిపతి

వైభవంగా సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన

బంగారు పల్లకిలో ఊరేగిన రాఘవేంద్రులు

సంస్థాన పూజ చేసిన పీఠాధిపతి

ఆకట్టుకున్న కళాకారుల నృత్యం

మంత్రాలయం ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు ఆశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా 6వ రోజు మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక పూజలు, అలంకరణ చేసి మహా మంగళహారతులు ఇచ్చారు. కర్ణాటకలోని నంజనగూడలో వెలసిన రాఘవేంద్ర స్వామి శిష్యులైన సుజ్ఞానేంద్రతీర్థుల బృందావనాన్ని పీఠాధిపతి ఆశీస్సులతో అక్కడి పండితులు ప్రత్యేక పూజలుచేసి, హారతులు ఇచ్చి శోభయానుమానంగా అలంకరిం చారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు అశ్వవాహనంపై మఠం ప్రాంగణం చుట్టూ ఊరేగారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించి చెక్క, వెండి, బంగారు, రజిత రథోత్స వాలపై ఊరేగారు. ఉత్సవాలను పురస్కరించుకుని వివిద రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాఘవేంద్ర బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఊరేగించారు. సంస్థాన పూజల్లో భాగంగా పూర్ణబోధ పూజామందిరంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మూలరాములకు, జయరాములు, దిగ్విజయకరాములకు బం గారు నాణేలతో అభిషేకించి హారతులిచ్చారు. కార్యక్రమంలో పండిత కేసరి రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన రాజాఎస్‌ గిరిరాజాచార్‌, మఠం దివాన సుజీంద్రాచార్‌, ఆనంద తీర్థాచార్‌, గౌతమాచార్‌, ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీని వాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోనాపూర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహ మూర్తి, ఏఈలు బద్రినాథ్‌, శ్రీహరి, వ్యాసరాజాచార్‌, బిందు మాధవ్‌, ద్వారపాలక అనంతస్వామి, జయతీర్థాచార్‌, వాదిరాజాచార్‌, డీఎం ఆనందరావు, జేపీ స్వామి, అనంతపురాణిక్‌, రవికులకర్ణి పాల్గొన్నారు.

ఆకట్టుకున్న నృత్యప్రదర్శన

ఉత్సవాల్లో ఆరవ రోజైన బుధవారం రాత్రి యోగీంద్ర కళామండపంలో బెంగుళూరుకు చెందిన సుధ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స వారిచే హరిదర్శన, నృత్యరూపకం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. బెంగుళూరు చెందిన విద్వాన ఎంఎస్‌ సుబ్బలక్ష్మి, బెంగుళూరు చెందిన దాసవాని సాహిత్యం భక్తులను కనువిందు చేశారు. వీటిని పీఠాధిపతి కనులారా తిలకించి ఆశిస్సులు అందజేశారు.

నేడు ఉత్సవాలకు ముగింపు

రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాలు గురువారం ముగియనున్నాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు సర్వసమర్పణోత్సవం చేసి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. పంచ రథాలపై ప్రహ్లాదరాయలను అలంకరించి ఊరేగించనున్నారు. పీఠాధిపతి బృందావనానికి మహా మంగళహారతులు ఇచ్చి భక్తులను ఆశీర్వదించి ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. ఈ సందర్భంగా ఉత్సవాల ముగింపులో భా గంగా గురువారం రాత్రి యోగీంద్ర కళామండపంలో బెంగుళూరు చెందిన విద్వాన ఎనఎస్‌ ప్రసాద్‌చే పూణేకి చెందిన విద్వాన ఆనంద్‌ భీమ్‌సేన జోషీచే శాస్త్రీయ సంగీతం, చెన్నైకి చెందిన కళాకారుల బృందంచే భరతనాట్యం భక్తులను ఆకట్టుకో నున్నాయి.

Updated Date - Aug 13 , 2025 | 11:40 PM