విద్యుత్ శాఖ ఎస్‌ఈగా ప్రదీప్‌కుమార్
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:59 PM
ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు జిల్లా ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈగా ఆర్.ప్రదీప్‌కుమార్ నియామకమయ్యారు.
కల్లూరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు జిల్లా ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈగా ఆర్.ప్రదీప్‌కుమార్ నియామకమయ్యారు. ఆదివారం సీఎండీ కే.సంతోషరావు కర్నూలు డీపీఈ విభాగం ఈఈగా పని చేస్తున్న ఆయనకు కర్నూలు విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా గార్గేయపురం వాసి అయిన ఆర్.ప్రదీప్‌కుమార్ విద్యుత్ శాఖలో 17-11-1991 ఏఈఈగా ఆర్టీపీపీ కాలమల్లలో విధులు ప్రారంభించారు. కర్నూలు ఆపరేషన్ డివిజన్ ఈఈగా కూడా ఆర్.ప్రదీప్‌కుమార్ పని చేశారు. అనంతరం 1998 నుంచి నేటి వరకు వివిధ విభాగాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఈఈ, ఈఈగా పనిచేస్తున్నారు. సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
సీజీఎంగా ఉమాపతికి పదోన్నతి
విద్యుత్ శాఖ ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ ఎం.ఉమాపతి తిరుపతి కార్పొరేట్ ఆఫీసులో సీజీఎంగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు తిరుపతి కార్పొరేట్ కార్యాలయంలో ఆర్‌ఏసీ-ఐపీసీ విభాగం సీజీఎంగా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఆయన సీజీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.