Share News

పీపీపీ విఽధానం తగదు

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:11 AM

కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న పీపీపీ విధానం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి అన్నారు.

    పీపీపీ విఽధానం తగదు
ర్యాలీగా వస్తున్న వైసీపీ నాయకులు

వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి

ఎస్టీబీసీ నుంచి జిల్లా పరిషత వరకు ర్యాలీ

కర్నూలు న్యూసిటీ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న పీపీపీ విధానం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విఽధానం రద్దు చేయాలని కోరుతూ బుధవారం వైసీపీ అధ్వర్యంలో ఎస్టీబీసీ కళాశాల నుంచి జిల్లా పరిషత వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోహనరెడ్డి మాట్లాడుతూ రూ.8 వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమంగా ర్యాలీ నిర్వహించామన్నారు. రూ. లక్షల కోట్లు ఖర్చుపెట్టి అమరావతిని అభివృద్ది చేస్తున్పప్పుడు రూ. ఐదు వేల కోట్లు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలకు కేటాయిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తమ బినామీల కోసమే మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తున్నదని విమర్శించారు. ప్రైవేటీకరణను ఆపకపోతే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు పరిశీలకులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, నగర మేయర్‌ బీవై. రామయ్య, నగర అధ్యక్షుడు అహ్మద్‌ అలీఖాన, కార్పొరేటర్లు యూనుస్‌ బాషా, రాజేశ్వరరెడ్డి, సత్యనారాయణమ్మ, మునెమ్మ, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:11 AM