CM Chandrababu: ఇంధన రంగాన్ని గాడిన పెట్టాం
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:51 AM
రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మేలు దిశగా కీలక అడుగు పడిందని, దేశ చరిత్రలో తొలిసారి ట్రూడౌన్‌తో విద్యుత్ చార్జీలు తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
అధిక ధర కొనుగోళ్లకు పవర్ స్వాపింగ్‌తో చెక్
నవంబరు నుంచి యూనిట్‌కు 13 పైసలు తగ్గింపు: సీఎం
విద్యుత్ భారం తగ్గిస్తున్నాం
అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మేలు దిశగా కీలక అడుగు పడిందని, దేశ చరిత్రలో తొలిసారి ట్రూడౌన్‌తో విద్యుత్ చార్జీలు తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో వచ్చిన సత్ఫలితాల కారణంగానే ఈ ఘనత సాధించామని సోమవారం ‘ఎక్స్’లో తెలిపారు. పీక్ డిమాండ్ ఉన్న సమయాల్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లకు.. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ విధానం ద్వారా చెక్ పెట్టామన్నారు. స్వల్పకాలిక కొనుగోళ్లలో ఎక్కువ రేటుకు కరెంటు కొనే అవసరం లేకుండా పవర్ స్వాపింగ్ ఉపయోగపడిందని చెప్పారు. ‘సమర్థ నిర్వహణతో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టి, ట్రూడౌన్ పేరుతో చార్జీలు తగ్గిస్తున్నాం. నవంబరు నుంచి యూనిట్‌కు 13 పైసలు తగ్గుతుంది. ప్రజలకు రూ.923 కోట్ల మేర భారం తగ్గిస్తున్నాం. రానున్న రోజుల్లో క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు నెలకొల్పి ప్రజలకు మరింత చౌకగా విద్యుత్ సరఫరా చేస్తాం’ అని వెల్లడించారు.