Power Bills Reduced: విద్యుత్ బిల్లులు తగ్గాయి.. ప్రభుత్వ సేవలూ మెరుగయ్యాయి!
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:10 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లుల భారం తగ్గించటం, ప్రభుత్వ సేవలు వేగవంతం కావటాన్ని అభినందిస్తూ బాపట్ల జిల్లా అద్దంకిలో ప్రభుత్వ....
అద్దంకి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లుల భారం తగ్గించటం, ప్రభుత్వ సేవలు వేగవంతం కావటాన్ని అభినందిస్తూ బాపట్ల జిల్లా అద్దంకిలో ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్యామ్‌కుమార్ సోమవారం అధికారులను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తమ ఇంటి కరెంటు బిల్లు నెలకు సరాసరిన రూ.2,200 నుంచి రూ.2,300 వచ్చేదని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీల భారం తగ్గిందని, నెలకు రూ.500 వరకు ఆదా అయ్యిందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సేవలు మెరుగయ్యాయని, తన కుమారుడికి అవసరమైన సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే నాలుగు రోజుల్లోనే అందించారంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం తహసీల్దార్ శ్రీచరణ్, ఎంపీడీవో వరూధినిలను కలిసి పుష్పగుచ్ఛాలందించి అభినందనలు తెలిపారు.