Amaravati: స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్‌గా పొట్టి శ్రీరాములు విగ్రహం
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:05 AM
రాజధాని అమరావతిలో నిర్మించనున్న 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’గా నామకరణం చేశారు.
అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మించనున్న 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’గా నామకరణం చేశారు. ఈ విగ్రహ నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం అమరావతి సచివాలయంలో పరిశీలించారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో 6.8 ఎకరాల్లో ప్రభుత్వం పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.