Share News

AP Chambers: మరోసారి ఏపీ చాంబర్స్‌ అధ్యక్షునిగా పొట్లూరి

ABN , Publish Date - Sep 28 , 2025 | 04:46 AM

రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్‌) అధ్యక్షునిగా పొట్లూరి భాస్కరరావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్లుగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న...

AP Chambers: మరోసారి ఏపీ చాంబర్స్‌ అధ్యక్షునిగా పొట్లూరి

అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్‌) అధ్యక్షునిగా పొట్లూరి భాస్కరరావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్లుగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భాస్కరరావు మరో రెండేళ్లపాటు ఈ పదవిలోనే కొనసాగనున్నారు. శనివారం విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో వివిధ రంగాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో ఏపీ చాంబర్స్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బి.రాజశేఖర్‌, జనరల్‌ సెక్రటరీగా రావూరి సుబ్బారావు, కోశాధికారిగా ఎస్‌.అక్కయ్యనాయుడు, ముగ్గురు జోనల్‌ వైస్‌ ప్రెసిడెంట్లు, 8 మందిని మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Updated Date - Sep 28 , 2025 | 04:47 AM