Share News

Anantapuram: పెళ్లి వేడుకలోనూ రప్పా.. రప్పా

ABN , Publish Date - Nov 24 , 2025 | 05:48 AM

వైసీపీ అధినేత జగన్‌ పర్యటించిన ప్రతిచోటా రప్పా-రప్పా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

Anantapuram: పెళ్లి వేడుకలోనూ రప్పా.. రప్పా

  • రాప్తాడు జగన్‌ పర్యటనలో ప్లకార్డులు

అనంతపురం కలెక్టరేట్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌ పర్యటించిన ప్రతిచోటా రప్పా-రప్పా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఆదివారం ఆయన అనంతపురం జిల్లా రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా ‘రప్పా.. రప్పా.. 2.0’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. జగన్‌ ర్యాలీగా రావడంతో దారి పొడవునా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Nov 24 , 2025 | 05:50 AM