Post Mortem Scheduled: మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:51 AM
మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు బుధవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు....
రంపచోడవరం, నవంబరు18(ఆంధ్రజ్యోతి): మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు బుధవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతుల గుర్తింపు అనంతరం మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఆ మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపర్చారు. మృతుల వివరాలను వారి కుటుంబీకులకు పోలీసులు తెలియపర్చారు. మృతుల కుటుంబీకులు బుధవారం నాటికి ఇక్కడకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. వారి రాక అనంతరం నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఆ తర్వాత మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగిస్తారు. పోస్టుమార్టం నేపథ్యంలో రంపచోడవరం ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.