గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:08 AM
ఎమ్మిగనూరు, నందవరం, పెద్దకడబూరు మండలాల్లో గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసి, నిందితుల నుంచి 5.490 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి మంగళవారం తెలిపారు.
నిందితుల అరెస్టు, రిమాండ్
ఎమ్మిగనూరు రూరల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి)ః ఎమ్మిగనూరు, నందవరం, పెద్దకడబూరు మండలాల్లో గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసి, నిందితుల నుంచి 5.490 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి మంగళవారం తెలిపారు. విలేకర్లతో ఆమె మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండలం గుడికల్లు సమీపంలోని గురుదత్త ఆశ్రమం దగ్గర కొంతమంది గంజాయితో ఉన్నట్లు సమాచారం తెలుసుకొని రూరల్ సీఐ చిరంజీవి, ఎమ్మిగనూరు రూరల్ ఇనచార్జి ఎస్‌ఐ తిమ్మారెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. నందవరం గ్రామానికి చెందిన చిడిగె కృష్ణ, ఎమ్మిగనూరుకు చెందిన అబ్దుల్లా, ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామానికి చెందిన గోవిందు, పెద్దకడబూరు మండలం కంబళదిన్నె గ్రామానికి చెందిన కురువ తిక్కన్న, నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన బోయ గంగప్పలను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. ఈ విచారణలో కనకవీడు గ్రామానికి చెందిన బోయ గంగప్ప పొలంలో గంజాయిని సాగుచేస్తున్నట్లు తేలిందన్నారు. గంగప్ప సాగు చేసిన గంజాయిని పై నలుగురు పట్టణంలోని గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ చిరంజీవి, ఎస్‌ఐ తిమ్మారెడ్డి, పోలీసు సిబ్బందిని డీఎస్పీ భార్గవి అభినందించారు.