రాష్ట్రంలో పాజిటివ్ గవర్నెన్స్: మంత్రి సత్యప్రసాద్
ABN , Publish Date - Jul 28 , 2025 | 06:01 AM
సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో పాజిటివ్ గవర్నెన్స్ నడుస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు.
విశాఖపట్నం, జూలై 27(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో పాజిటివ్ గవర్నెన్స్ నడుస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. ఏడాది కాలంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీనివల్ల యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు పెట్టేందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలను జగన్మోహన్‌రెడ్డి వెళ్లగొట్టారని ఆరోపించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైందని తెలిపారు.