Share News

Poornahuti Ceremony: పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

ABN , Publish Date - Aug 08 , 2025 | 06:29 AM

తిరుమలలో గురువారం పవిత్ర పూర్ణాహుతితో మూడురోజుల పవిత్రోత్సవాలు ముగిశాయి. గురువారం ఉదయం యాగశాలలో ఋత్వికులు హోమాలను నిర్వహించారు.

Poornahuti Ceremony: పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుమల, ఆగస్టు7(ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారం పవిత్ర పూర్ణాహుతితో మూడురోజుల పవిత్రోత్సవాలు ముగిశాయి. గురువారం ఉదయం యాగశాలలో ఋత్వికులు హోమాలను నిర్వహించారు. మధ్యా హ్నం ఒంటి గంటకు విశేష సమర్పణ, 4 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగాయి. రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీమలయప్పస్వామి శ్రీదేవి, భూదేవిలతో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీఈవో లోకనాథం, పేష్కార్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 06:29 AM